Skip to main content

Posts

ఇది ఖాకీ (అ)న్యాయం! ఖమ్మంలో సీఐ అరాచకపర్వం

వివాహితకు వల, సీఐ పై కేసు నమోదు ఖమ్మం : న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఓ ఇన్ స్పెక్టర్ (సీఐ) పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా టాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ అయిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెను వేధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో ఆ మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్ స్పెక్టర్ రాజు నాయక్  ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా నమ్మించి, లొంగదీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇటీవల ఖమ్మం నగరంలో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  మరొక మహిళా తో కూడా ఎఫ్ఫైర్ నడిపానట్లు తన గొడవ తరవాత తెలిసిందని ప్రస్తుత బాధితురాలు తెలిపింది. బాధ్యత గల పోలీస్ సీఐ భార్య ఉండగా ఇద్దరు మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేసినట్లు ఆరోపించింది.  సదరు సీఐ అరాచకపర్వంపై విచారణ చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి. మహిళా పి.ఎస్. లో ఎస్ .హెచ్ .ఓ గా ఉన్న సమయంలో ప్రైవేటు సై...

మంత్రి తుమ్మల.. పైలాన్ నిర్మాణంపై సీరియస్, తొలగింపు

ఖమ్మం : రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, మచ్చలేని ఇమేజ్ ఉన్న నాయకులను సైతం ఒక్కోసారి అనుచరుల అత్యుత్సాహం వివాదాల్లోకి నెడుతుంది. ఇందుకు ఖమ్మం నగరం వేదికైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల మంత్రి రాజకీయ ప్రస్థానానికి చిహ్నంగా కొందరు ముఖ్య నాయకులు తలపెట్టిన ‘పైలాన్’ (స్తూపం) నిర్మాణం.. చివరకు ఆయనకే మచ్చ తెచ్చేలా మారడంతో అమాత్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల తక్షణమే ఆ పనులను నిలిపివేయించి వివాదానికి తెరదించారు. స్థానిక లకారం ట్యాంక్ బండ్ జంక్షన్ లో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం వెనుక భాగంలో ఒక పైలాన్ నిర్మాణాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు రాత్రి కి రాత్రి చొరవ చూపారు. ఈ నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఒక పచ్చని చెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఈ పనుల్లో వేగం పెంచారు. బుధవారం పైలాన్ నిర్మాణ భూమి పూజ కూడా చేశారు. యువ నేత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే, పీవీ లాంటి మహోన్నత వ్యక్తి విగ్...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ సోషల్ మీడియ పోస్ట్ కలకలం

నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. గ్రూప్-2 అధికారిగా ఎక్సైజ్ శాఖలో చేరి, డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో పని చేస్తుండగా ఆయన గతంలో ఖమ్మం తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పని చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లిన మేథాశక్తి గల ఉన్నతాధికారి. సోషల్ మీడియా వేదికగా ఈ అధికారి అత్యంత ఆవేదనతో విడుదల చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కమిషనర్ కార్యాలయానికి వెళ్లినపుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని ఎస్.ఎం లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ కమిషనర్ అయినటువంటి తనను కమిషనర్ దుర్భాషలాడారని, వాటిని తట్టుకోలేక కిందపడి పోగా, స్నేహితులు ఆసుపత్రికి తరలించారని సోమిరెడ్డి చెబుతున్నారు. సోమిరెడ్డిని దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. సోషల్ మీడియాలో బాధి...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...

జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి నూతన భవనం నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పెవిలియన్ గ్రౌండ్ పక్కన ఉన్న  జిల్లా గ్రంథాలయం లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీగోడ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మితమవుతున్న నూతన రెండు అంతస్ధుల భవనంతో పాటు విద్యార్ధులకు, అభ్యర్ధులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుసంధానంగా ప్రహారీ గోడ, గేట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో ముచ్చటించ...

వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు ఎంవీఐ ఏ.వరప్రసాద్ ను అరెస్టు

 వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు  ఎంవీఐ ఏ.వరప్రసాద్ ను అరెస్టు ఖమ్మం :  వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్ నుంచి  నగదు తీసుకుంటున్న వైరా ఎంవీఐ పర్సనల్ అసిస్టెంట్  రాజశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్   తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లా పెనుబల్లి కి చెందిన ఓ కాంట్రాక్టర్  5 టిప్పర్లు,  4 ట్రాక్టర్లతో  ఖమ్మంకు నిరంతరం ఇటుక రవాణా చేస్తున్నారు.  వైరా మీదుగా వాహనాలు ఖమ్మం వెళ్లేందుకు ఎంవీఐ లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ తెలిపారు. నెలకు ఒక్కో టిప్పర్ కు రూ.3200, ఒక్కో ట్రాక్టర్ కు రూ.2200 చొప్పున లంచం ఇవ్వాలని  డిమాండ్ చేశారు. 5 టిప్పర్లు, 4 ట్రాక్టర్లకు సంబంధించి నెలకు రూ.24800 ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు నిరాకరించటంతో  ఇటీవల సదరు కాంట్రాక్టర్  ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా తమకు నెలవారీ మామూలు ఇవ్వాలని  ఎంవీఐ ప...

ఖమ్మం ప్రెస్ క్లబ్ పై తక్షణమే విచారణ చేయించాలి జిల్లా కలెక్టర్ కు వినతి

ఖమ్మం ప్రెస్ క్లబ్ పై  తక్షణమే  విచారణ చేయించాలి జిల్లా కలెక్టర్ కు వినతి ఖమ్మం: ఖమ్మం  ప్రెస్ క్లబ్  లో  జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జర్నలిస్టుల ఉమ్మడి వేదికగా ఉండాల్సిన ప్రెస్ క్లబ్‌ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని ‘ప్రైవేట్ క్లబ్’లా నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్-2843) జిల్లా కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణలు లోకల్ బాడీస్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సభ్యత్వాల పేరుతో రూ.1000 నుంచి రూ.3000 వరకు ఎటువంటి నిబంధనలు, రశీదులు లేకుండా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ నిధులపై ఎటువంటి లెక్కలు, ఖాతాలు వెల్లడించకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటివరకు క్లబ్ నిధులపై ఆడిట్ నిర్వహించలేదని, లెక్కలు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ తాళాలు కూడా కొద్దిమంది వ్యక్తుల వద్దే ఉండటం, ఇతర జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించడం, వాట్సాప్ గ్రూపుల్లో ఇతర యూనియన్ ప్రతినిధులకు అడ్మ...

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి  యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్  ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు.  కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ...