వివాహితకు వల, సీఐ పై కేసు నమోదు
ఖమ్మం : న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఓ ఇన్ స్పెక్టర్ (సీఐ)పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా టాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ అయిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెను వేధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో ఆ మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్ స్పెక్టర్ రాజు నాయక్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా నమ్మించి, లొంగదీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇటీవల ఖమ్మం నగరంలో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరొక మహిళా తో కూడా ఎఫ్ఫైర్ నడిపానట్లు తన గొడవ తరవాత తెలిసిందని ప్రస్తుత బాధితురాలు తెలిపింది. బాధ్యత గల పోలీస్ సీఐ భార్య ఉండగా ఇద్దరు మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేసినట్లు ఆరోపించింది. సదరు సీఐ అరాచకపర్వంపై విచారణ చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి. మహిళా పి.ఎస్. లో ఎస్ .హెచ్ .ఓ గా ఉన్న సమయంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని మరీ అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలతో అరచకాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను బ్రోకర్ల సహాయంతో నమోదు చేసిన అన్ని కేసులపై రీ ఎంక్వయిరీ చేయించాలని బాధితులు డిజిపి కి ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ బ్రోకర్ల ను ప్రైవేటు సైన్యంగా పెట్టు కుని చేసిన దందా పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు . భార్య - భర్త ల కేసుల్లో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్న తర్వాత రాజీ పడ్డ కేసుల్లోనూ , భార్య లకు మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. కౌన్సిలింగ్ టీం పేరిట మహిళా పోలీస్ స్టేషన్ లో మధ్య దళారి పనులు చేసే బ్రోకర్ల ద్వారా తప్పు డు ఫిర్యాదులు, దొంగ అవిడెన్స్ లు పెట్టించి భర్త లను బ్లాక్ మెయిల్ చేయడం పరిపాటిగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. బెదిరింపులకు భయపడ్డ వారు సదరు టీం కు పెద్ద మెత్తం లో డబ్బులు ముట్ట జెప్పి కేసుల నుండి బైటపడేలా సదరు పోలీస్ అధికారి చక్రవ్యూహం పన్నేవారని పలువురు వాపోతున్నారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినప్పటికీ ఛార్జ్ షీట్ వేయకుండా నెలల తరబడి బెదిరింపులకు పాల్పడి వసూళ్ల కు పాల్పడే ముఠాను (ప్రైవేటు సైన్యాన్ని) సదరు అధికారి ఏర్పాటు చేయడం గమనార్హం. తనతో చనువుగా ఉండే మహిళ దొరికితే చాలు ఆమె చేసే పైరవీ సక్సెస్ అయినట్టేనని పోలీస్ శాఖ లో చర్చ నడుస్తోంది. సదరు పోలీస్ సారూ మహిళా పి.ఎస్. ఎస్ .హెచ్ .ఓ ఉన్న సమయంలో అమాయకంగా బలైన పలువురు నిర్ధోషులకు ఇకనైనా విమూక్తి కల్పించాలని ఆయన నమోదు చేసిన తప్పుడు కేసుల ను పునర్ విచారించాలని డిజిపి కి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం క్రైమ్ స్టేషన్ లో పని చేస్తున్న సదరు సీఐ పై బాధిత మహిళా ఫిర్యాదు మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దింతో ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (బదిలీ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని 6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్, 12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది. అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

Comments
Post a Comment