ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు. కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే కౌలుకు తీసుకున్నారో వారి యొక్క పట్టాదారు పాస్ బుక్ నెంబరు ద్వారా బుక్ చేసుకోవచ్చని, అయితే ఆ పట్టాదారు ఓటీపీ చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ యాప్ ను రైతులకు అలవాటు చేయటానికి, అవగాహన కల్పించడానికి ప్రతి ఔట్లెట్ దగ్గర వ్యవసాయ శాఖ ద్వారా ఒక వ్యక్తి ని నియమించడం జరుగుతుందని లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి రైతులకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. రైతులందరూ ఈ యాప్ ను వినియోగించుకొని యూరియాను కొనుగోలు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. డీలర్లు, సహకార సంఘాల వారు యాప్ లో మాత్రమే యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతులు తమ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ ను ప్లే స్టోర్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, తద్వారా రైతులు ఏ విధమైన ఆందోళన, శ్రమ లేకుండా తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకొని యూరియా కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. యాప్ అందుబాటులోకి రావడం ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత యూరియా అందుబాటులో ఉందనే సమాచారం రైతులందరికీ తెలియటం వల్ల రైతులు తమ ఇంటి వద్ద నుండే యూరియా ను బుక్ చేసుకొని 24 గంటల్లో కొనుగోలు చేస్తున్నారన్నారు. యాప్ తో క్యూ లైన్ లలో నిలబడే అవసరం లేదని, సమయం ఆదా అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని 6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్, 12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది. అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

Comments
Post a Comment