వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని 6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్, 12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది. అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల సురక్షితంగా మంచి మెజార్టీతో బయటపడ్డారు. 10, 11, 12, 15 వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థులు కట్టప్పల వల్ల ఓటమిని చవిచూశారు. 6,9,10,11,15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ బలమైన వర్గం ప్రయత్నించిందని ప్రచారం జరుగుతోంది . అయితే వారి ప్రయత్నాలు 10, 11, 15 వార్డుల్లో సఫలీకృతమయ్యాయి. 6,9 వార్డుల్లో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 9వ వార్డులో ఆ వర్గం చేసిన వ్యతిరేకతకు ప్రతిగా 12వ వార్డులో ఓ మహిళ కేంద్ర స్థాయి నేత వర్గం వెన్నుపోటు పొడిచిందని ప్రచారం జరుగుతుంది. 7వ వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థి పై అక్కడ టికెట్ ఆశించి భంగపడిన ప్రభుత్వం లోని కీలక స్థానంలో ఉన్న వర్గం వారు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలు వైరాలో సంచలనంగా మారాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా, లేదా ఇలాంటి వెన్నుపోట్ల వ్యవహారంతో ఇరుకున పడుతుందా తెలియాలంటే చైర్ పర్సన్ ఎన్నిక రోజు తేలనుంది.
చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు
కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...
Comments
Post a Comment