Skip to main content

Posts

Featured Post

బ్రాండెడ్ పేరిట నకిలీ సామాన్లు.. ఖమ్మం అడ్డాగా తయారీ

పోలీస్ దాడుల్లో బహిర్గతం ఖమ్మం, : ఆశీర్వాద్ సంస్థ పేరుతో నకిలీ పైపులు విక్రయిస్తున్న ఖమ్మం పీఎస్ ఆర్ రోడ్డులోని జగదాంబ ఎంటర్ప్రైజెస్ దుకాణంపై గత ఫిబ్రవరి 25న ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.40వేల పైపులు, జాయింట్లు, ఎల్బీలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ వ్యాపారి నిర్వహిస్తున్న శానిటరీ సామగ్రి గోదాములో నకిలీ విద్యుత్తు వైర్ల భారీ నిల్వలను పోలీసులు ఆగస్టు 8న పట్టుకున్నారు. నకిలీ వైర్లను అట్టల్లో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారుచేసిన విద్యుత్ వైర్లను ఆయన నగరంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేయడంతో పాటు ఎలక్ట్రిషన్లకు కమిషన్ ఇచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. రాజ స్థాన్ వ్యాపారి ఈ దందా నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రల సరిహద్దు తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మార్కెట్ ను  శాసిస్తు న్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. భవన నిర్మాణంలో సిమెంటు నుంచి విద్యుత్తు సామగ్రి వరకు ప్రతీది ప్రధానమైనదే. నాణ్యతలేని, నకిలీ వస్తువుల కారణంగా సంభవించే ప్రమాదాలతో భవన యజమానులు, అం...
Recent posts

ఖమ్మం బల్దియాలో అక్రమాల పర్వం

ఖమ్మం : రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పని తీరు రోజు రోజుకు మసక బారుతోంది. పాలకవర్గం గడువు ముగియడంతో కొందరు అధికారులు జూలు విదుల్చుతున్నారు. అక్రమాలకు తేర లేపారు. ఇటీవల డీజిల్, పెట్రోల్  కుంభకోణం  మరువకముందే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద అక్రమ వసూళ్లు వెలుగు చూసింది. ఓ యువ కార్పొరేటర్ పై ప్రత్యర్థుల తో కలిసి మెప్మా సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కమిషనర్ పేషీ సీసీ చేతివాటం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తయి రెండవ విడత లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయించింది. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో అర్హుల గుర్తింపు ప్రక్రియను వార్డు ఆఫీసర్లకు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన వారు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చేతులు తడపాల్సిందే అంటూ తమదైన పద్ధతిలో వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఒక ఇంటికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూళ్లకు పాల్పడ్డారు. ఓ వార్డు ఆఫీసర్ గా ఉన్న కమిషనర్ పేషీ సీసీ చేతివాటం...

పూర్తి కాని గ్రీన్ ఫీల్డ్ పై రాకపోకలు కొరవడిన భద్రతా చర్యలు

ప్రమాదాలు 15,  మృతులు 6, గాయాలు 25 వైరా/ఖమ్మం : హడావుడిగా పనులు.. ప్రారంభానికి ముందే రాక పోకలు.. ప్లాజాలు తెరవడం.. వాహనదారుల ముక్కు పిండి టోల్ వసూలు చేయడం.. ఇదీ ఎన్ హెచ్ ఏ ఐ అధి కారుల తీరు. రాబడిపైనున్న ధ్యాస రహదారి భద్రతపై కొరవడటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నగరంలో ప్రమాదాలు జరు గుతున్నాయంటూ పనులు పూర్తికాక ముందే.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతించడం దుర్ఘటనలకు కారణమవుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కి. మీ. మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్-365 బీజీ) పై కొన్ని నెలల క్రితం వైరా నుంచి రాకపోకలు ప్రారంభించి టోల్ వసూలు చేస్తు న్నారు. తాజాగా ఖమ్మం నగరం మీదుగా వాహనాలు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ హైవేలో 15 దుర్ఘట నలు జరిగాయి. తల్లాడలో ఒక కాని స్టేబుల్, వేంసూర్ లో  లారీ, ఉల్లిపా యల లోడు ఢీకొన్న ఘటనలో క్లీనర్, కల్లూరు మండలం లింగాలలో రేయి లింగ్ ను  బైక్ ఢీకొనడంతో ఏపీ వాసులు ఇద్దరు మరణించారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. 25  మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిప...

రూ.547 కోట్ల కాదు.. రూ.1,000 కోట్లు! సంచలనం సత్తుపల్లి సైబర్ మోసాల కేసు

రంగంలోకి  ''సిట్'' బృందం విదేశీ లింకులు, కీలక సూత్రధారులపై ఫోకస్ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన ఈ కేసు, దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీలతో కూడిన దేశ వ్యాప్త సైబర్ నెట్వర్క్ మారే అవకాశాలు కనిపించడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీసీఎస్బీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించింది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాలకు విస్తరించిన నిధుల బదిలీలు, బ్యాంకు ఖాతాల వినియోగం, అంతర్జాతీయ లింకులు, మాస్టర్ మైండ్ల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు రాష్ట్రంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరాల్లో ఒకటిగా అధికారులు భావిస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా దేశవ్యాప్తంగా వసూలైన డబ్బును అమాయకుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా మ...

Political Conspiracy to Ruin My Image: Former Corporator Raparthi Sharath Denies Viral Video Allegations

Khammam: Former Khammam Corporation 50th Division (Raparthi Nagar) Corporator Raparthi Sharath has strongly condemned the video going viral on social media and the allegations leveled against him, terming them a deliberate political conspiracy to damage his reputation.  Addressing the controversy, Sharath clarified that he treats the RP Jayamma working in the 50th Division like a family member and respectfully calls her "akka" (elder sister). He expressed deep anguish that facts are being intentionally distorted to run a false propaganda campaign against him. He alleged that some opponents are trying to politically destabilize him and ruin his personal image by unfairly linking him to petty incidents in the Raparthi Nagar area. Sharath further alleged that vested interests are using paid articles to create confusion among the public for their own political gains. Pointing out that police and relevant officials have already conducted an inquiry into the matter, he asserted th...

మళ్ళి ఖమ్మానికి మున్నేటి గండం?

రెండేళ్ల క్రితం ప్రారంభం నేటికీ సా...గుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 15 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరానికి మళ్ళీ మున్నేటి గండం పొంచి ఉంది. ఖమ్మం కార్పొరేషన్, ఏదులాపురం పురపాలిక మధ్య ప్రవహిస్తున్న మున్నేరు కారణంగా.. భారీ వర్షాలు  వచ్చినప్పుడు వరదలు ముంచెత్తుతు న్నాయి. ఖమ్మంలో 10 ప్రాంతాలు, ఏదులాపురం పట్టణంలో 10 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2024లో కురిసిన భారీ వర్షాలకు రెండు వైపులా వరద ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ళు మునిగిపోయాయి. బురద తొలగించడానికి వారం రోజు లకు పైనే పట్టింది. గత ఏడాది  భారీ వర్షా లకు మున్నేరు ముంచెత్తడంతో పలు కాలనీలు జలమయమ య్యాయి. సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా 17 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ (కాంక్రీట్ కరకట్ట) నిర్మిం చడానికి 2024 జూన్ లో పనులు మొదలయ్యాయి. ఎగువన దానవాయిగూడెం నుంచి దిగువన ప్రకాశ్ నగర్ వరకు నదికి రెండు వైపులా 8.50 కి. మీ. చొప్పున మొత్తం 17 కి. మీ. పొడవున కరకట్టలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణానికి రూ.6.90 కోట్లు వ్యయమవుతోంది. వీటిని 2025 డిసెంబరులోపే పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ పూర్తికాక ఆలస్యమవుతోంది. ప్రస్తు...

అటు బదిలీ.. ఇటు కొనసాగింపు వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ లొల్లి

ఓ నేత స్నేహ హస్తంపై భారీ ఆరోపణలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ చేత్తో బదిలీ ఆర్డర్ ఇచ్చి మరో వైపు ఆన్ డ్యూటి(ఓడి) ఉత్తర్వులు ఇవ్వడంపై రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ఆయన తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా సెక్రటరీ పని తీరుపై మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోప...