Skip to main content

మళ్ళి ఖమ్మానికి మున్నేటి గండం?



రెండేళ్ల క్రితం ప్రారంభం నేటికీ

సా...గుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 15 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరానికి మళ్ళీ మున్నేటి గండం పొంచి ఉంది. ఖమ్మం కార్పొరేషన్, ఏదులాపురం పురపాలిక మధ్య ప్రవహిస్తున్న మున్నేరు కారణంగా.. భారీ వర్షాలు  వచ్చినప్పుడు వరదలు ముంచెత్తుతు న్నాయి. ఖమ్మంలో 10 ప్రాంతాలు, ఏదులాపురం పట్టణంలో 10 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2024లో కురిసిన భారీ వర్షాలకు రెండు వైపులా వరద ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ళు మునిగిపోయాయి. బురద తొలగించడానికి వారం రోజు లకు పైనే పట్టింది. గత ఏడాది  భారీ వర్షా లకు మున్నేరు ముంచెత్తడంతో పలు కాలనీలు జలమయమ య్యాయి. సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా 17 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ (కాంక్రీట్ కరకట్ట) నిర్మిం చడానికి 2024 జూన్ లో పనులు మొదలయ్యాయి. ఎగువన దానవాయిగూడెం నుంచి దిగువన ప్రకాశ్ నగర్ వరకు నదికి రెండు వైపులా 8.50 కి. మీ. చొప్పున మొత్తం 17 కి. మీ. పొడవున కరకట్టలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణానికి రూ.6.90 కోట్లు వ్యయమవుతోంది. వీటిని 2025 డిసెంబరులోపే పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ పూర్తికాక ఆలస్యమవుతోంది. ప్రస్తుతం అంగీకారం తెలిపిన రైతుల భూముల్లో పనులు చేపడుతున్నారు. 17 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణానికి సుమారు 9 కి.మీ. మాత్రమే పూర్తి అయింది. భూ సేకరణ సమస్య కారణంగా మధ్య మధ్యలో గ్యాప్ తో వాల్ నిర్మించారు. గోడ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. పోలేపల్లిలో 125 ఎకరాల ఎన్నెస్పీ స్థలాన్ని కొన్ని నెలల క్రితం రెవెన్యూ శాఖకు అప్పగించారు. అందులోనే 100, 150, 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలుగా లే అవుట్ అభివృద్ధి చేస్తున్నారు. ఎకరం భూమికి 650 గజాల స్థలం ఇచ్చేలా అధికారులు, రైతులకు మధ్య ఒప్పందం కుదిరినట్లు చెపుతున్నారు. కొందరు రైతులు వ్యతిరేకిస్తు న్నారు. కరుణగిరి నుంచి ఈ లేఔట్ వరకు రోడ్డు, వంతెన నిర్మాణా నికి ప్రభుత్వం రూ.53.8 కోట్లు మంజూరు చేసింది. ఇంకా పట్టా భూములు ఖమ్మం రూరల్ లో 56.04 ఎకరాలు, ఖమ్మం అర్బన్ లో 82.27 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మున్నేటికి ఒక వైపు కాల్వ ఒడ్డు(ఖమ్మం నగరం) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం నియోజకవర్గం పరిధిలో ఉంది. మరో వైపు ఏదులాపురం మునిపాల్టీ (ఖమ్మం రూరల్) పాలేరు  నియోజకవర్గం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిధి  కావడంతో వారిద్దరు రిటైనింగ్ వాల్ పూర్తి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ భూ సేకరణ పెద్ద సవాల్ గా మారింది. దింతో మధ్య మధ్యలో గ్యాప్ తో వాల్ నిర్మించారు. గత రెండు, మూడు ఏళ్లుగా మున్నేరు ఉగ్ర రూపం దాల్చుతోంది. మహబూబాద్ నుంచి వరద పోటుఎత్తుతుంది. గత ఏడాది 42 అడుగులు రావడంతో పరివాహక కాలనీలు నీట మునిగాయి. కట్టు బట్ట లతో వారు బయటకు వచ్చారు. ఇంట్లోని వస్తువులు నీటిలో తెలియాడాయి. ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి ఆ గండం నుంచి ఎలా బయటపడాలని స్థానికులు కలత చెందుతున్నారు. మధ్య మధ్యలో గ్యాప్ తో వాల్ నిర్మాణడంతో ఇళ్ల వైపు వచ్చిన నీళ్లు తిరిగి మున్నేటి కి వెళ్లకుండా గోడ ఉండడంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇళ్ల మునక లేకుండా  రిటైనింగ్ వాల్ త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...