Skip to main content

అటు బదిలీ.. ఇటు కొనసాగింపు వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ లొల్లి



ఓ నేత స్నేహ హస్తంపై భారీ ఆరోపణలు


ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ చేత్తో బదిలీ ఆర్డర్ ఇచ్చి మరో వైపు ఆన్ డ్యూటి(ఓడి) ఉత్తర్వులు ఇవ్వడంపై రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ఆయన తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా సెక్రటరీ పని తీరుపై మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రైతుల సంక్షేమం చూడాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి అంతే కాకుండా వ్యాపారులతో కుమ్మక్కై తప్పుడు కాటాలు వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దడవాయిలపై (తూకం వేసే కార్మికులు) ఫిర్యాదులు వస్తున్నా వారిపై కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ, మార్కెట్ అభివృద్ధిపై కానీ, రైతులకు జరిగే అన్యాయంపైగానీ సెక్రటరీకి చిత్తశుద్ధి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ నేతలు ఎవరు?

నిత్యం ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, వివాదాస్పదంగా మారిన ఈ సెక్రటరీని బదిలీ కాకుండా కాపాడుతున్న ఆ అధికార పార్టీ నాయకులు ఎవరనేది ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల ఉసురు తగులుతున్నా పట్టించుకోకుండా, కేవలం మామూళ్లకు, పైరవీలకు తలొగ్గి సదరు అధికారికి అధికార పార్టీ పెద్దలు అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ ప్రజా ప్రతినిధిని డమ్మీ చేసి ఓ నేత వారాంతపు వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు కర్షక మంత్రి జిల్లాలోనే మార్కెట్ వసూళ్ల దందాపై ఫిర్యాదులు రావడం గమనార్హం. రైతులకు న్యాయం జరగాలన్నా, మార్కెట్ గాడిన పడాలన్నా.. ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి ఈ ‘పొడిగింపుల’ వెనుక ఉన్న మాయాజాలంపై, మార్కెట్‌లో జరుగుతున్న అవినీతి దందాపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.


Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...