Skip to main content

చీరలు.. మామిడి పచ్చడి.. సీజనల్ పాలి''ట్రిక్స్'



 ఖమ్మం మున్సి''పల్స్'' కార్పొరేషన్ రసవత్తరం


ఖమ్మం: "ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట" చందంగా ఉంది జిల్లా కేంద్రం అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని రాజకీయ నాయకుల పరిస్థితి. ఇక్కడి పాలకవర్గం గడవు ఈ నెల మొదటి వారంతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేదు. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ లతో పాటు జరుగుతాయనేది ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడంతో రెండు సార్లు బిఆర్ఎస్ మేయర్లు పని చేశారు. మొట్ట మొదటి మేయర్ గా డాక్టర్ పాపాలాల్ వ్యవహరించారు. ఆ తర్వాత మేయర్ గా నీరజ పని చేశారు. ఆమె కారు పార్టీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆమెనే కొనసాగించారు. పదేళ్ల పాటు టి(బి)ఆర్ఎస్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేటర్లుగా పార్టీ అవకాశం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిన ఇతర పార్టీ నేతలు సైతం కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు. కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లకు గాను 57 డివిజన్లు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి(మంత్రి తుమ్మల నాగేశ్వరావు)లో ఉన్నాయి. మరో మూడు డివిజన్లు పాలేరు నియోజకవర్గం(మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) పరిధిలో ఉన్నాయి. అధికార పార్టీలో ప్రతి డివిజన్ లో  పాత, కొత్త నేతలతో కలిపి నలుగురు, ఐదుగురు నేతలు పోటీలో ఉంటున్నారు. జిల్లా కేంద్రం కావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఇతర నేతల అనుచరులు సైతం కార్పొరేషన్ టికెట్ రేసులో ఉంటున్నారు.



మేయర్ మాదే.. కార్పొరేటర్ల అ''టెన్షన్''

బతుకమ్మకు పంచాల్సిన ప్రభుత్వ ఇందిరమ్మ చీరలను సైతం ఇప్పటికీ బల్దియాలో పంపిణీ కొనసా..గుతుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఇంకా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మామిడి కాయల పచ్చడి సీజన్ కావడంతో కొందరు ఆశావాహు లు తమ డివిజన్ లో  ఇంటింటికి పచ్చడి లేదా మామిడి కాయలను పంపిణీ చేస్తున్నారు. మరికొందరు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తొలిసారి మేయర్ ఎన్నికలు వస్తుండడంతో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఖమ్మం 3 టౌన్ ఏరియా వంటి బలం లేని చోట ఇతర పార్టీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటుంది. కాంగ్రెస్ హవాను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ నేతలు పలు డివిజన్ ల లో చాప కింద నీరులా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్న ఒక కార్పొరేటర్ సంఖ్య ను పెంచుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఉన్న పూర్వ వైభవం కోసం సిపిఎం, సిపిఐ కసరత్తులు చేస్తోంది. ఇండిపెండెంట్, ఇతర పార్టీలు సైతం కార్పొరేషన్ లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మేయర్ స్థానం గత రిజర్వేషన్ మాదిరిగా జనరల్ మహిళా అయింది. అన్ని వర్గాల మహిళా నేతలకు అవకాశం ఉంది. అయితే జనరల్ కాబట్టి తమ సామాజిక వర్గానికే దక్కతుందని ఓ వర్గం ధీమాగా ఉంది. అమాత్యుని వద్ద ఉన్న ఓ నేత సతీమణి తాజా మాజీ మహిళా కార్పొ రేటర్ సహా పలువురు మహిళా నేతలు నగర ప్రథమ పౌరురాలు కావాలని రాజకీయాలు చేస్తున్నారు. డివిజన్ ల లో రిజర్వేషన్ లు మారుతుండడంతో కార్పొ రేటర్ ఆశావహులు తమకు అనుకూలమైన డివిజన్ల పై దృష్టి సారించారు. ప్రస్తుత సీజనల్ పాలిట్రిక్స్ తో త్వరలో జరిగే ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి నుంచే రసవత్తరంగా మారింది.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...