Skip to main content

జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

నూతన భవనం నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్



ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పెవిలియన్ గ్రౌండ్ పక్కన ఉన్న  జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీగోడ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మితమవుతున్న నూతన రెండు అంతస్ధుల భవనంతో పాటు విద్యార్ధులకు, అభ్యర్ధులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుసంధానంగా ప్రహారీ గోడ, గేట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో ముచ్చటించారు. ఏ పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు, ఎటువంటి  పుస్తకాలు కావాలి, ఏమైనా అవసరాలు కావాలా వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్దులు, విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం అప్ డేట్ అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు పాతవి మార్చాలని, పాఠకులు యువకులతో చర్చించి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ప్రతి విభాగం వారీగా అవసరమైన పుస్తకాల జాబితాను తయారు చేసి వెంటనే అందించాలన్నారు. విద్యార్థులు, యువత  విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా, అదే సమయాన్ని గ్రంథాలయంలో గడపడం ద్వారా కొత్త కొత్త విషయాలు, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది భాస్కర్ రావు, అఖిల్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...