Skip to main content

ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ సోషల్ మీడియ పోస్ట్ కలకలం



నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. గ్రూప్-2 అధికారిగా ఎక్సైజ్ శాఖలో చేరి, డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో పని చేస్తుండగా ఆయన గతంలో ఖమ్మం తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పని చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లిన మేథాశక్తి గల ఉన్నతాధికారి. సోషల్ మీడియా వేదికగా ఈ అధికారి అత్యంత ఆవేదనతో విడుదల చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కమిషనర్ కార్యాలయానికి వెళ్లినపుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని ఎస్.ఎం లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ కమిషనర్ అయినటువంటి తనను కమిషనర్ దుర్భాషలాడారని, వాటిని తట్టుకోలేక కిందపడి పోగా, స్నేహితులు ఆసుపత్రికి తరలించారని సోమిరెడ్డి చెబుతున్నారు. సోమిరెడ్డిని దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. సోషల్ మీడియాలో బాధిత అధికారి విడుదల చేసిన పోస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు!

ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉంది. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు!

నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడ లేడని చాలా సార్లు అనిపించింది. నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాను. వారికి ఎప్పటికి బుుణపడి ఉంటాను. ఇక నేను ఇక్కడ ఇమడ లేనని పూర్తిగా అర్ధం అయ్యింది. చేయని తప్పుకి “వెధవ , ఇడియట్” అన్నప్పుడు నాలో సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేక పోయింది. నేను ఒక్కటే మాట ఎదురు చెప్పాను, “ అలాంటి మాట అనొద్దు సార్ “ అని మాత్రమే . నేను ఎదురు చెప్పిన ఆ చిన్న మాటకు కమీషనర్ గారి ఈగో హర్ట్ అయిందనుకుంటా! ఎవరు ఎన్నడు ఎదురు చెప్పి ఉండరు కదా! “10 నిమిషాలు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి చదివాడు. నా జీవితంలో ఎన్నడు ఎదుర్కోని ఘోర అవమానం చేసాడు. నాతోనే , నేను వెధవను అనిపించేలా ప్రయత్నం చేసాడు.

అదే గదిలో నలుగురు అధికారులు , సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యథకు గురి చేసింది. అయినా తట్టుకున్నాను. బయటకు వచ్చి విషయం మిత్రులకు, అధికారులకు చెప్పాను. అలా ఎలా మనల్ని అంటాడని అందరికి చెప్పాను. ప్రశ్నిద్దాం అని చెప్పాను. కమీషనర్ అవమానించిన దాని కన్నా కూడా అన్నాయాన్ని ప్రశ్నిద్దాం అన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారులు , మిత్రుల భయం , మౌనం నన్ను బాగా కలచి వేసింది. అక్కడే కుప్పకూలి పోయాను. మిత్రులు హాస్పటల్ కు చేర్చారని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరపున కృతజ్ఞతలు. అరేయ్, ఓరేయ్, వెధవ, ఇడియట్, యూసిలెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా , దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అధికారులకు, మిత్రులకు. ఇతర అధికారులకు నమస్కారం!

నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితం అని నమ్మాను. “ఆకలితో నైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం” అన్న కాళోజి మాటలు యాది చేసుకుంటూ “ చేతకాని, చావలేని , చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను.” నా కుటుంబ సభ్యులతో చర్చించాను, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను (ఉద్యోగం) వీడివెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన , నాకు సహకరించిన ఉన్నతాధికారులకు మిత్రులకు మరియు సిబ్బందికి

కృతజ్ఞతలు. 🙏


ఇట్లు

సోమిరెడ్డి

డిప్యూటీ కమిషనర్

నిజామాబాద్ డివిజన్.


#ఈ పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నాను.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం: జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జనవరి, 29వ తేదీ నుండి  యూరియా పంపిణి యాప్ ద్వారా జరుగుతుందని, ఈ వారం రోజుల్లో 25252 మంది రైతులు 108721 యూరియా సంచులను యాప్  ద్వారా బుక్ చేసుకున్నారని, 87350 సంచులను కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంట రకమును బట్టి, వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ వద్ద అయినా, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు.  కౌలుదారులు అయితే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ...

ఖమ్మం ప్రెస్ క్లబ్ పై తక్షణమే విచారణ చేయించాలి జిల్లా కలెక్టర్ కు వినతి

ఖమ్మం ప్రెస్ క్లబ్ పై  తక్షణమే  విచారణ చేయించాలి జిల్లా కలెక్టర్ కు వినతి ఖమ్మం: ఖమ్మం  ప్రెస్ క్లబ్  లో  జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జర్నలిస్టుల ఉమ్మడి వేదికగా ఉండాల్సిన ప్రెస్ క్లబ్‌ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని ‘ప్రైవేట్ క్లబ్’లా నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్-2843) జిల్లా కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణలు లోకల్ బాడీస్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సభ్యత్వాల పేరుతో రూ.1000 నుంచి రూ.3000 వరకు ఎటువంటి నిబంధనలు, రశీదులు లేకుండా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ నిధులపై ఎటువంటి లెక్కలు, ఖాతాలు వెల్లడించకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటివరకు క్లబ్ నిధులపై ఆడిట్ నిర్వహించలేదని, లెక్కలు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ తాళాలు కూడా కొద్దిమంది వ్యక్తుల వద్దే ఉండటం, ఇతర జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించడం, వాట్సాప్ గ్రూపుల్లో ఇతర యూనియన్ ప్రతినిధులకు అడ్మ...