Skip to main content

Posts

Showing posts from June, 2026

మళ్ళి ఖమ్మానికి మున్నేటి గండం?

రెండేళ్ల క్రితం ప్రారంభం నేటికీ సా...గుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 15 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరానికి మళ్ళీ మున్నేటి గండం పొంచి ఉంది. ఖమ్మం కార్పొరేషన్, ఏదులాపురం పురపాలిక మధ్య ప్రవహిస్తున్న మున్నేరు కారణంగా.. భారీ వర్షాలు  వచ్చినప్పుడు వరదలు ముంచెత్తుతు న్నాయి. ఖమ్మంలో 10 ప్రాంతాలు, ఏదులాపురం పట్టణంలో 10 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2024లో కురిసిన భారీ వర్షాలకు రెండు వైపులా వరద ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ళు మునిగిపోయాయి. బురద తొలగించడానికి వారం రోజు లకు పైనే పట్టింది. గత ఏడాది  భారీ వర్షా లకు మున్నేరు ముంచెత్తడంతో పలు కాలనీలు జలమయమ య్యాయి. సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా 17 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ (కాంక్రీట్ కరకట్ట) నిర్మిం చడానికి 2024 జూన్ లో పనులు మొదలయ్యాయి. ఎగువన దానవాయిగూడెం నుంచి దిగువన ప్రకాశ్ నగర్ వరకు నదికి రెండు వైపులా 8.50 కి. మీ. చొప్పున మొత్తం 17 కి. మీ. పొడవున కరకట్టలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణానికి రూ.6.90 కోట్లు వ్యయమవుతోంది. వీటిని 2025 డిసెంబరులోపే పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ పూర్తికాక ఆలస్యమవుతోంది. ప్రస్తు...

అటు బదిలీ.. ఇటు కొనసాగింపు వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ లొల్లి

ఓ నేత స్నేహ హస్తంపై భారీ ఆరోపణలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ చేత్తో బదిలీ ఆర్డర్ ఇచ్చి మరో వైపు ఆన్ డ్యూటి(ఓడి) ఉత్తర్వులు ఇవ్వడంపై రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ఆయన తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా సెక్రటరీ పని తీరుపై మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోప...

చీరలు.. మామిడి పచ్చడి.. సీజనల్ పాలి''ట్రిక్స్'

  ఖమ్మం మున్సి''పల్స్'' కార్పొరేషన్ రసవత్తరం ఖమ్మం: "ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట" చందంగా ఉంది జిల్లా కేంద్రం అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్  లోని రాజకీయ నాయకుల పరిస్థితి. ఇక్కడి పాలకవర్గం గడవు ఈ నెల మొదటి వారంతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేదు. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ లతో పాటు జరుగుతాయనేది ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడంతో రెండు సార్లు బిఆర్ఎస్ మేయర్లు పని చేశారు. మొట్ట మొదటి మేయర్ గా డాక్టర్ పాపాలాల్ వ్యవహరించారు. ఆ తర్వాత మేయర్ గా నీరజ పని చేశారు. ఆమె కారు పార్టీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆమెనే కొనసాగించారు. పదేళ్ల పాటు టి(బి)ఆర్ఎస్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేటర్లుగా పార్టీ అవకాశం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిన ఇతర పార్టీ నేతలు సైతం కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు. కార్పొరేషన్ లో మొత్...