ఖమ్మం మున్సి''పల్స్'' కార్పొరేషన్ రసవత్తరం ఖమ్మం: "ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట" చందంగా ఉంది జిల్లా కేంద్రం అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని రాజకీయ నాయకుల పరిస్థితి. ఇక్కడి పాలకవర్గం గడవు ఈ నెల మొదటి వారంతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేదు. హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ లతో పాటు జరుగుతాయనేది ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారడంతో రెండు సార్లు బిఆర్ఎస్ మేయర్లు పని చేశారు. మొట్ట మొదటి మేయర్ గా డాక్టర్ పాపాలాల్ వ్యవహరించారు. ఆ తర్వాత మేయర్ గా నీరజ పని చేశారు. ఆమె కారు పార్టీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆమెనే కొనసాగించారు. పదేళ్ల పాటు టి(బి)ఆర్ఎస్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్ నాయకులు కార్పోరేటర్లుగా పార్టీ అవకాశం కల్పిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేరిన ఇతర పార్టీ నేతలు సైతం కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్నారు. కార్పొరేషన్ లో మొత్...