Skip to main content

బ్రాండెడ్ పేరిట నకిలీ సామాన్లు.. ఖమ్మం అడ్డాగా తయారీ

పోలీస్ దాడుల్లో బహిర్గతం




ఖమ్మం, :

ఆశీర్వాద్ సంస్థ పేరుతో నకిలీ పైపులు విక్రయిస్తున్న ఖమ్మం పీఎస్ ఆర్ రోడ్డులోని జగదాంబ ఎంటర్ప్రైజెస్ దుకాణంపై గత ఫిబ్రవరి 25న ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.40వేల పైపులు, జాయింట్లు, ఎల్బీలు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ వ్యాపారి నిర్వహిస్తున్న శానిటరీ సామగ్రి గోదాములో నకిలీ విద్యుత్తు వైర్ల భారీ నిల్వలను పోలీసులు ఆగస్టు 8న పట్టుకున్నారు. నకిలీ వైర్లను అట్టల్లో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారుచేసిన విద్యుత్ వైర్లను ఆయన నగరంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేయడంతో పాటు ఎలక్ట్రిషన్లకు కమిషన్ ఇచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. రాజ స్థాన్ వ్యాపారి ఈ దందా నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు.




తెలుగు రాష్ట్రల సరిహద్దు


తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మార్కెట్ ను  శాసిస్తు న్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. భవన నిర్మాణంలో సిమెంటు నుంచి విద్యుత్తు సామగ్రి వరకు ప్రతీది ప్రధానమైనదే. నాణ్యతలేని, నకిలీ వస్తువుల కారణంగా సంభవించే ప్రమాదాలతో భవన యజమానులు, అందులో నివ సించే వారు ఆర్థికంగా నష్టపో తున్నారు. ప్రముఖ సంస్థల పేరుతో అంటగట్టే నకిలీ వస్తు వుల(డూప్లికేట్ ప్రొడక్ట్స్) కు ఖమ్మం నగరం అడ్డాగా మారిందనే విషయం పోలీసులకు పట్టుబడుతున్న సంఘటన తెలియజేస్తున్నాయి. ప్రధాన బ్రాండ్ల పేరుతో కొందరు వ్యాపారులు యదేచ్ఛగా మోసాలకు పాల్పడు తున్నారు. ఎలక్ట్రికల్, భవన నిర్మాణ రంగంలో సమస్య తీవ్రంగా ఉంది. బ్రాండెడ్ కంపెనీల పేరిట నాసిరకం వైర్లు స్విచ్ బోర్డులు ఇతర విద్యుత్తు ఉపకరణాలు, వివిధ రకాల పైపులు, శానిటరీ సామగ్రి తదితరాలు ఖమ్మం మార్కెట్లో పోటెత్తుతు న్నాయి. దిల్లీ, రాజస్థాన్ ల నుంచి పెద్ద మొత్తంలో దిగు మతి అవుతున్నట్లు సమాచారం. ఏ మాత్రం తేడా గుర్తించటానికి వీల్లేని విధంగా ఉండటంతో వినియోగదారులు సులువుగా మోసపోతున్నారు. నాసిరకం వైర్లు, ఉపకరణాలతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమా దాలు జరుగుతున్నాయి. గోడ లోపల పైపులు నాసిరకంగా ఉండి నీరు లీకై భవనాలు దెబ్బతింటున్నాయి. దీర్ఘకాలం పని చేయాల్సిన శానిటరీ సామగ్రి నెలల వ్యవధిలో పాడై పోతున్నాయి. బ్రాండ్ల పేరుతో ఇవి ఉండటంతో విని యోగదారులు లోపం గుర్తించ లేకపోతున్నారు. స్వీయ నిర్ల క్ష్యమే ఇందుకు కారణమన్న భావనంలో ఉండిపోతున్నారు.


ఊరి బయట భారీ గోదాములు..

అక్రమ వ్యాపారుల దుకాణాలు ఖమ్మం నగర  శివార్లలో ఉంటున్నాయి. తక్కువ అద్దెతో లభించే ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేస్తు న్నారు. ఎవరి గోదాము ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. వాటిల్లో ఏం ఉంచు తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని దుకాణాల్లో బిల్లు లేకుండా రూ. కోట్లలో వ్యాపారం  సాగుతున్నా అధికారులు అటుగా చూడటం లేదన్న విమర్శలున్నాయి. నిఘా లేకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా అక్రమాలు సాగిస్తున్నారు. ఇటీవల దాడుల ఘటనల్లో నష్టపోతున్న ఆసలు (ఒరిజినల్) బ్రాండెడ్ సంస్థ వారు చేసినవే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...