పోలీస్ దాడుల్లో బహిర్గతం ఖమ్మం, : ఆశీర్వాద్ సంస్థ పేరుతో నకిలీ పైపులు విక్రయిస్తున్న ఖమ్మం పీఎస్ ఆర్ రోడ్డులోని జగదాంబ ఎంటర్ప్రైజెస్ దుకాణంపై గత ఫిబ్రవరి 25న ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.40వేల పైపులు, జాయింట్లు, ఎల్బీలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ వ్యాపారి నిర్వహిస్తున్న శానిటరీ సామగ్రి గోదాములో నకిలీ విద్యుత్తు వైర్ల భారీ నిల్వలను పోలీసులు ఆగస్టు 8న పట్టుకున్నారు. నకిలీ వైర్లను అట్టల్లో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారుచేసిన విద్యుత్ వైర్లను ఆయన నగరంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేయడంతో పాటు ఎలక్ట్రిషన్లకు కమిషన్ ఇచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. రాజ స్థాన్ వ్యాపారి ఈ దందా నిర్వహిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రల సరిహద్దు తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి మార్కెట్ ను శాసిస్తు న్నారు. నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. భవన నిర్మాణంలో సిమెంటు నుంచి విద్యుత్తు సామగ్రి వరకు ప్రతీది ప్రధానమైనదే. నాణ్యతలేని, నకిలీ వస్తువుల కారణంగా సంభవించే ప్రమాదాలతో భవన యజమానులు, అం...