Skip to main content

పూర్తి కాని గ్రీన్ ఫీల్డ్ పై రాకపోకలు కొరవడిన భద్రతా చర్యలు




ప్రమాదాలు 15,  మృతులు 6, గాయాలు 25

వైరా/ఖమ్మం : హడావుడిగా పనులు.. ప్రారంభానికి ముందే రాక పోకలు.. ప్లాజాలు తెరవడం.. వాహనదారుల ముక్కు పిండి టోల్ వసూలు చేయడం.. ఇదీ ఎన్ హెచ్ ఏ ఐ అధి కారుల తీరు. రాబడిపైనున్న ధ్యాస రహదారి భద్రతపై కొరవడటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నగరంలో ప్రమాదాలు జరు గుతున్నాయంటూ పనులు పూర్తికాక ముందే.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతించడం దుర్ఘటనలకు కారణమవుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కి. మీ. మేర నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ (ఎన్ హెచ్-365 బీజీ) పై కొన్ని నెలల క్రితం వైరా నుంచి రాకపోకలు ప్రారంభించి టోల్ వసూలు చేస్తు న్నారు. తాజాగా ఖమ్మం నగరం మీదుగా వాహనాలు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ హైవేలో 15 దుర్ఘట నలు జరిగాయి. తల్లాడలో ఒక కాని స్టేబుల్, వేంసూర్ లో  లారీ, ఉల్లిపా యల లోడు ఢీకొన్న ఘటనలో క్లీనర్, కల్లూరు మండలం లింగాలలో రేయి లింగ్ ను  బైక్ ఢీకొనడంతో ఏపీ వాసులు ఇద్దరు మరణించారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. 25  మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై వైరా మండలం సోమవారం వద్ద చాన్నాళ్లుగా అనుమతిస్తున్నారు అయితే ధoసలాపురం బ్రిడ్జి ఇటీవల పూర్తయిన ఇంకా ఎగ్జిట్ వద్ద ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ హడావుడిగా నాలుగు రోజుల  క్రితం రాకపోకలు అనుమతించారు. ఈ విషయమై విస్తృత  ప్రచారం జరగడంతో వాహనదారులు హైవేను ఎంచుకుంటున్నారు కాగా హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఎక్కాల్సిన అప్రోచ్ రోడ్డును పనులు దృశ్య అధికారులు మూసేశారు. ఇదే సమయాన దేవరపల్లి వెళ్లే మార్గంలో హైవే ఎక్కి రోడ్డును మూసివేయలేదు. అంతేగాక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు కూడా దేవరపల్లి వైపు ఉన్న రోడ్డుపైకి ఎక్కి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయకపోవడం గురువారం నాటి ప్రమాదం జరిగిందని వాహనదారులు  ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగగానే అధికారులు హైదరాబాద్ వైపు ఎంట్రీ పాయింట్ ను వదిలేయడం గమనార్హం. దేవరపల్లి ఎంట్రన్స్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే ఎగ్జిట్ దారుల్లో ఎలాంటి సైన్ బోర్డులు లేవు

హైదరాబాద్ కు దారేది?

ఖమ్మం బోనకల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్కే ర్యాంపు ప్రవేశం దారి నిర్మాణం పూర్తి కాలేదు. దేవరపల్లి నుంచి వచ్చిన వాహనాలు ఖమ్మం నగరంలోకి వెళ్లేందుకు నిష్క్రమణ దారి లేకపోవడంతో వాహనాలు తికమక పడుతున్నారు. ఈ దారి మూసివేయడంతోనే గురువారం హైదరాబాద్ వెళ్లడానికి మరో దారిలో ఎదురెళ్లిన కారు-డీసీఎం ఢీకొనడంతో తల్లి, కుమారుడు మరణించారు. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

అధికారులు ఏమంటున్నారంటే

హై వే అంశంపై ఎన్ హెచ్ ఏ ఐ  పిడి దివ్య మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో భారీ లోడు వాహనాలు రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రీన్ ఫీల్డ్ పై రాకపోకలకు అనుమతించాం. ర్యాంపులు నిర్మాణం పూర్తి కాలేదని ఖమ్మంలో రాకపోకలు నిలిపివేశాం. వెంకటగిరి, వైరా వద్ద మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ దారులు తెరిచాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...