Skip to main content

రూ.547 కోట్ల కాదు.. రూ.1,000 కోట్లు! సంచలనం సత్తుపల్లి సైబర్ మోసాల కేసు

రంగంలోకి  ''సిట్'' బృందం


విదేశీ లింకులు, కీలక సూత్రధారులపై ఫోకస్

దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం



సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన ఈ కేసు, దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీలతో కూడిన దేశ వ్యాప్త సైబర్ నెట్వర్క్ మారే అవకాశాలు కనిపించడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీసీఎస్బీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించింది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాలకు విస్తరించిన నిధుల బదిలీలు, బ్యాంకు ఖాతాల వినియోగం, అంతర్జాతీయ లింకులు, మాస్టర్ మైండ్ల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు రాష్ట్రంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరాల్లో ఒకటిగా అధికారులు భావిస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా దేశవ్యాప్తంగా వసూలైన డబ్బును అమాయకుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి, అక్రమ నిధులను చట్టబద్ధమైన లావాదేవీలుగా మార్చే వ్యవస్థను నిందితులు ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ప్రతి వారం దర్యాప్తు పురోగతి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఖమ్మం నుంచి మొదలైన దర్యాప్తు

సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అతని పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు నమోదైన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆ ఖాతాల ద్వారా భారీ స్థాయిలో అను మానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో ఖమ్మంలోని వీఎం బంజారా పోలీస్ స్టే షన్లో నమోదైన మరో కేసులో కూడా ఇలాంటి తరహా లావాదేవీలు బయటపడటంతో రెండు కేసులను అనుసంధానం చేసి ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశాలతో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో నిందితులు నిరుద్యోగ యువకులు, రోజు వారీ కూలీలు, చిన్న వ్యాపారులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. ఉద్యోగాలు, కమిషన్లు, వ్యాపార అవ కాశాల పేరుతో వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఏటీఎం కార్డులు, చెక్ బుక్ లు , ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి వసూలైన డబ్బును ఈ ఖాతాల ద్వారా మరో ఖాతాలకు మళ్లించారు. ఇలాంటి మ్యూల్ అకౌంట్లు వందల సంఖ్యలో వినియోగించినట్లు తేలింది.

అనేక రకాల సైబర్ నేరాల అనుసంధానం

కొద్ది నెలల కిందట సత్తుపల్లి కేంద్రంగా 60 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వీరిని జైలుకు పంపిన ఆ తర్వాత బెయిల్ పై వచ్చి దర్జాగా తిరుగుతుండడంతో సత్తుపల్లి , కల్లూరు ప్రాంత యువకులు అదే దారి పడ్తున్నారు. ఈ నెట్వర్కు కు  స్టాక్ మార్కెట్ పెట్టుబడి మోసాలు, క్రిప్టో పెట్టుబడి పేరుతో మోసాలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు, ఓటీపీ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు వంటి పలు రకాల సైబర్ నేరాలతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో సిట్ కు కేటాయించారు. ఈ మోసాల ద్వారా వచ్చిన నిధులను మ్యూల్ ఖాతాల ద్వారా పలు బ్యాంకులకు బదిలీ చేసినట్లు అధికారు లు అప్పట్లో గుర్తించారు. నిధుల ప్రవాహం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. చివరకు ఎవరి ఖాతాలకు చేరింది, విదేశీ సర్వర్లు లేదా క్రిప్టో వాలెట్ల వినియోగం ఉందా. అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ఇతర సైబర్ నేర ముఠాలతో ఈ నెట్వర్కు సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించగా, మరికొందరి కోసం గాలింపు కొనసా గుతోంది. ప్రధాన నిందితుడు పోట్రు ప్రవీణ్ బిఆర్ఎస్ యువ నేతగా ఉన్నారు. సైబర్ మోసాల ద్వారా కొల్లగొట్టిన  సొమ్మును తన వ్యక్తి గత రాజకీయ పలుకుబడి కోసం వినియోగించారు. వందలు అడిగిన వారికి వేల రూపాయలు అందజేశాడు. ప్రభుత్వం మారగానే ఆయన గుట్టు బయటపడింది. ఈ కేసులో ఇతర నిందితులు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ ఉన్నారు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి స్థాయి అనుచరులుగా ఇందులో కొందరికి ముద్ర ఉండడంతో వారిని ఆఖరున అరెస్ట్ చేశారు. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు ఉన్నట్లు స్థానిక పోలీసులు తేల్చారు. ప్రస్తుతం
ఈ కేసులో విదేశీ లింకులు  రూ.547 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీల ఉండడం, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై లోతైన విచారణ చేపట్టనున్నారు. బ్యాంకు లావాదేవీల డిజిటల్ ట్రైల్ ఆధారంగా కీలక సూత్రధారులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

Popular Posts

వైరా కాంగ్రెస్ లో వెన్ను పోట్లు

వైరా: ఖమ్మం జిల్లాలోని వైరా పుర పాలక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వెన్నుపోట్లపై ఫలితాల అనంతరం విస్తృతంగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో మూడు కాంగ్రెస్ వర్గాలు వెన్నుపోటుకు కత్తులు దూసుకున్నాయి. అయితే 3 వార్డుల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఈ వెన్నుపోట్ల కత్తుల గాయాల నుంచి సురక్షితంగా  బయటపడ్డారు. మరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు  వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. వైరా మున్సిపాలిటీలోని  6, 7, 9, 10, 11, 12, 15 వార్డుల్లో  వెన్నుపోటు రాజకీయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  కాపా చంద్రకళ, 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పణితి సైదులు,  9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్ల సంతోష్, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు త్రివేణి, 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి రమేష్,  12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని  మిట్టపల్లి కృష్ణవేణి, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి  రాంపూడి రాజ్యలక్ష్మి పై వెన్నుపోట్లు రాజకీయాలు జరిగాయని ప్రచారం జరుగుతుంది.  అయితే వెన్నుపోట్ల రాజకీయాల నుంచి 6, 7, 9 వ...

చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు.. పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి. పదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ కు అండగా. పదవి రాకుండానే అనంతలోకాలకు

కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం : మహమ్మద్ జావీద్ .. కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మైనార్టీ నాయకుడు. అతని మోము పై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల టీ(బి).ఆర్.ఎస్. పాలనలో కాంగ్రెస్ జెండా విడువలేదు. అంతేగాక పార్టీ ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చే జారింది. పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో మంత్రి అయ్యారు. ఎప్పుడు చిరునవ్వు చిందించే కాంగ్రెస్ నేత జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. జావీద్ మృతితో ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కష్ట కాల...

భద్రాచలం: కమనీయం రాములోరి కల్యాణం ..!

కమనీయం రాములోరి కల్యాణం ..! ఆకాశమంత పందిరి...!  భూదేవంత మండపం...! వేదగోష పరిమళాలు...! జయ జయ ద్వానాలు...! ఇది..భద్రగిరినా...!? దక్షిణఅయోధ్యపురినా...!? భక్తుల సంభ్రమాశ్చర్యాలు...! ఖచ్చితంగా 12 గంటలకు...! సాంప్రదాయ అభిజిత్ లగ్నాన...! రాములోరు సీతమ్మవారిని పరిణయం మాడారు...!  భద్రాచలంలో  శుక్రవారం జరిగిన  రాములోరి కళ్యాణం వైభోగమే...! ముగ్ధ మనోహరమే...! కనులారా తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి...! భద్రగిరి భక్తులతో పోటెత్తింది...! భద్రాచలం:    భద్రాచలం దివ్య క్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీతారాముల పరిణయ వేడుక ఆబాల గోపాలాన్ని మరిపించింది. ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. శుక్రవారం వేకువజామునే రామాలయంలో తొలుత అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం నివేదన గావించారు. మూలవర్లకు అభిషేకం జరిపారు. తొలుత ఆలయంలో ఏకాంతంగా ధృవమూర్తుల కళ్యాణం  నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులకు అలంకారం గావించారు.  స్వామివారిని పల్లకిపై కూర్చుండబెట్టి వేదమంత్రాలు,బాజా భజంత్రీలు, కోలాట దృశ్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించి స్వామివారిని మిధిలా ప్రాం...