రంగంలోకి ''సిట్'' బృందం విదేశీ లింకులు, కీలక సూత్రధారులపై ఫోకస్ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన ఈ కేసు, దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీలతో కూడిన దేశ వ్యాప్త సైబర్ నెట్వర్క్ మారే అవకాశాలు కనిపించడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీసీఎస్బీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించింది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాలకు విస్తరించిన నిధుల బదిలీలు, బ్యాంకు ఖాతాల వినియోగం, అంతర్జాతీయ లింకులు, మాస్టర్ మైండ్ల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు రాష్ట్రంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరాల్లో ఒకటిగా అధికారులు భావిస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా దేశవ్యాప్తంగా వసూలైన డబ్బును అమాయకుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా మ...