రెండేళ్ల క్రితం ప్రారంభం నేటికీ సా...గుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 15 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరానికి మళ్ళీ మున్నేటి గండం పొంచి ఉంది. ఖమ్మం కార్పొరేషన్, ఏదులాపురం పురపాలిక మధ్య ప్రవహిస్తున్న మున్నేరు కారణంగా.. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదలు ముంచెత్తుతు న్నాయి. ఖమ్మంలో 10 ప్రాంతాలు, ఏదులాపురం పట్టణంలో 10 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2024లో కురిసిన భారీ వర్షాలకు రెండు వైపులా వరద ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్ళు మునిగిపోయాయి. బురద తొలగించడానికి వారం రోజు లకు పైనే పట్టింది. గత ఏడాది భారీ వర్షా లకు మున్నేరు ముంచెత్తడంతో పలు కాలనీలు జలమయమ య్యాయి. సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా 17 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ (కాంక్రీట్ కరకట్ట) నిర్మిం చడానికి 2024 జూన్ లో పనులు మొదలయ్యాయి. ఎగువన దానవాయిగూడెం నుంచి దిగువన ప్రకాశ్ నగర్ వరకు నదికి రెండు వైపులా 8.50 కి. మీ. చొప్పున మొత్తం 17 కి. మీ. పొడవున కరకట్టలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణానికి రూ.6.90 కోట్లు వ్యయమవుతోంది. వీటిని 2025 డిసెంబరులోపే పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ పూర్తికాక ఆలస్యమవుతోంది. ప్రస్తు...